Jun 8 2021 @ 11:33AM

'లైగర్‌'కి క్లైమాక్స్ హైలెట్ ..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా 'లైగర్'. సాలా క్రాస్ బ్రీడ్ అనే ఉప శీర్షికతో రూపొందుతోంది. ఈ చిత్రానికి క్లైమాక్స్ ఎంతో హైలెట్‌గా నిలుస్తుందని ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పూరి సినిమాలలో హీరో ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాడో ఆయన చుట్టు ఉండే పాత్రలు అంతే స్ట్రాంగ్‌గా ఉంటాయి. పూరి మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా జోడించి తీస్తాడు. 'బద్రి', 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', 'పోకిరి' లాంటి ఎమోషనల్ సీన్స్ ఇప్పుడు లైగర్‌లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. 

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. కేవలం క్లైమాక్స్ మాత్రమే షుటింగ్ బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమా మీద భారీ హైప్ క్రియేటయింది. సెప్టెంబర్ 9న సినిమా దేశవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి పోస్ట్‌పోన్ చేసే అవకాశాలున్నాయట. కాగా ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యార్‌పై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.