ఫ్లిప్‌కార్ట్‌ చేతికి క్లియర్‌ట్రిప్‌

ABN , First Publish Date - 2021-04-16T05:51:07+05:30 IST

వాల్‌మార్ట్‌ సారథ్యంలోని దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌’ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొత్త రంగాలకు

ఫ్లిప్‌కార్ట్‌ చేతికి  క్లియర్‌ట్రిప్‌

న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌ సారథ్యంలోని దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌’ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొత్త రంగాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సేవల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌ ట్రావె ల్‌ టెక్నాలజీ సంస్థ ‘క్లియర్‌ట్రి్‌ప’ను కొనుగోలు చేసింది. క్లియర్‌ట్రిప్‌ ప్రత్యేక కంపెనీగా కొనసాగుతూనే తన వ్యాపారాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. అయితే క్లియర్‌ట్రి్‌పను ఎంతకు కొనుగోలు చేసిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Updated Date - 2021-04-16T05:51:07+05:30 IST