గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-29T06:39:30+05:30 IST

గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపడేందుకు చెత్త సేకరణ చేయాలని, అందుకు ప్రజల భాగస్వామ్యంతో కొద్దిపాటి పన్ను వసూలు చేసి పారిశుధ్య కార్మికుల జీతాలకు అదనంగా అందించాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సూచించారు.

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపర్చాలి: కలెక్టర్‌
రాఘవాపురంలో పంచాయతీ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్‌

చింతలపూడి, మే 28: గ్రామాలలో పారిశుధ్యం మెరుగుపడేందుకు చెత్త సేకరణ చేయాలని, అందుకు ప్రజల భాగస్వామ్యంతో కొద్దిపాటి పన్ను వసూలు చేసి పారిశుధ్య కార్మికుల జీతాలకు అదనంగా అందించాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సూచించారు. చింతలపూడి మండలంలోని రాఘవాపురం, చింతలపూడి గ్రామాల్లో కలెక్టర్‌ పర్యటించారు. రాఘవాపురం సచివాలయాన్ని తనిఖీ చేశారు. పారిశుధ్య కార్మికులు ఎంతమంది ఉన్నారు, చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఇబ్బందులు ఏమిటనేవి తెలుసుకు న్నారు. ఇళ్ళ నిర్మణాల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అయితే పంచాయతీ పాలకవర్గం 14, 15 ఆర్ధిక సంఘం నిధులు వెనక్కిపోవడం వలన సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామని ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం చింతలపూ డిలో ప్రభుత్వాసుపత్రిని తనిఖీ జరిపారు. సౌకర్యాలు, డాక్టర్లు, సిబ్బంది కొరతపై తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా పంచాయతీ అధికారి బాలాజీ, గ్రామ సర్పంచ్‌ల ప్రత్యేక అధికారి కె.శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ప్రమద్వర, ఎంపీడీవో రాజ్‌మనోజ్‌, ఎంపీపీ రాంబాబు, జడ్పీటీసీ నీరజ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T06:39:30+05:30 IST