రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-04-10T06:12:14+05:30 IST

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు మరింత వేగవంతంగా నిర్వహించేలా

రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశం


ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 9 : కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు మరింత వేగవంతంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణల శా ఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గురువారం ఒంగోలు కార్పొరేషన్‌ అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ ని ర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ఒంగోలులో గురువారం వర్షం కురిసినందున ప్రజలకు ఇబ్బం దులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


నగరంలో హైరి స్క్‌ ప్రాంతాల్లో బ్లీచింగ్‌ ఎక్కువ మోతాదులో వేయడంతో పాటు కూరగాయలు విక్రయించే పీవీఆర్‌ మైదానంతో పాటు శివారు కాలనీల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చేయాలని ఇంజనీరింగ్‌ అధికా రులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి బా లినేని హెచ్చరించారు. నగరంలో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు ప్రభుత్వం నుంచి అందే అన్ని సదుపాయాలు ప్రజలకు అందించేలా చూడాలని కమిషనర్‌ నిరంజన్‌రెడ్డిని ఆదేశించారు. అధికారులు, సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు తక్షణమే అందించాలన్నారు.

Updated Date - 2020-04-10T06:12:14+05:30 IST