ఇంటింటా చెత్త సేకరణతోనే క్లీన్‌ ఆంధ్రా

ABN , First Publish Date - 2021-06-20T03:52:34+05:30 IST

ప్రతి ఇంటా వందశాతం చెత్తను సేకరిస్తేనే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుందని సూళ్లూరుపేట మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి అన్నారు.

ఇంటింటా చెత్త సేకరణతోనే క్లీన్‌ ఆంధ్రా
క్లీన్‌ ఆంధ్రా శిక్షణ తరగతుల్లో మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల

సూళ్లూరుపేట, జూన్‌ 19 : ప్రతి ఇంటా వందశాతం చెత్తను సేకరిస్తేనే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుందని సూళ్లూరుపేట మున్సిపల్‌ చైర్మన్‌ దబ్బల శ్రీమంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు మెప్మా రిసోర్స్‌ పర్సన్లు శ్రద్ధ చూపాలని కోరారు. శనివారం స్థానిక స్త్రీస్వశక్తి భవనంలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌పై మెప్మా రిసోర్స్‌ పర్సన్లకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహించారు.  ముఖ్య అతిథిగా మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ తడి, పొడి చెత్తతోపాటు హానికర వ్యర్థాలు వేరుచేయాలని సూచించారు. కమిషనర్‌ నరేంద్రకుమార్‌, రెవెన్యూ ఆఫీసర్‌ పోతురాజు, మెప్మా మేనేజర్‌ పెంచలయ్య, పీవో నారాయణమ్మ, హనుమాయమ్మ, భాస్కర్‌, అరుణ, టీఎల్‌ఎఫ్‌ అధ్యక్ష కార్యదర్శులు స్వప్న, వెంకటరమణమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T03:52:34+05:30 IST