నేటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు క్లాసులు

ABN , First Publish Date - 2021-01-18T05:15:45+05:30 IST

తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కొవిడ్‌ ఆంక్షల

నేటి నుంచి ఆరో తరగతి విద్యార్థులకు క్లాసులు



(గుజరాతీపేట)

ఆరో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కొవిడ్‌ ఆంక్షల సడలింపులో భాగంగా ఇప్పటికే 7, 8, 9, 10 తరగతులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆరో తరగతి విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధలను పక్కాగా పాటించాలని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో చంద్రకళ ఆదేశాలు జారీచేశారు. తరగతి గదుల్లో శానిటైజ్‌ చేయడంతో పాటు విద్యార్థులకు మాస్కులు అందించాలని సూచించారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. జిల్లాలో ఆరో తరగతి విద్యార్థులు 37,531 మంది చదువుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు 12,591 మంది, బాలికలు 13,697 మంది,  ప్రైవేటు పాఠశాలల్లో బాలురు 6,928 మంది, బాలికలు 4,315 మంది చదువుతున్నారు.

కొత్త టైమ్‌టేబుల్‌
ఆరో తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభంకానున్న నేపథ్యంలో నూతన టైమ్‌ టేబుల్‌ను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఆదివారం విడుదల చేశారు.  నూతన టైమ్‌ టేబుల్‌ ప్రకారం 7,9 తరగతుల విద్యార్థులకు సోమ, బుధ, శుక్రవారాల్లో,  6, 8 తరగతుల విద్యార్థులకు మంగళ, గురు, శనివారాల్లో, పదో తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 1.30 గంటల వరకూ తరగతులు నిర్వహించాలని డీఈవో చంద్రకళ అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశించారు.

Updated Date - 2021-01-18T05:15:45+05:30 IST