Letter to PM Modi: పెన్సిల్, ఎరేజర్, మ్యాగీ ధరలు పెరిగిపోయాయి.. ప్రధానికి ఓ చిన్నారి లేఖ!

ABN , First Publish Date - 2022-08-01T21:42:23+05:30 IST

ద్రవ్యోల్బణం (Inflation) విపరీతంగా పెరిగిపోవడంతో దేశంలో అన్ని వస్తువుల ధరలూ భగ్గుమంటున్నాయి.

Letter to PM Modi: పెన్సిల్, ఎరేజర్, మ్యాగీ ధరలు పెరిగిపోయాయి.. ప్రధానికి ఓ చిన్నారి లేఖ!

ద్రవ్యోల్బణం (Inflation) విపరీతంగా పెరిగిపోవడంతో దేశంలో అన్ని వస్తువుల ధరలూ భగ్గుమంటున్నాయి. మరోవైపు జీఎస్టీ కూడా తోడవడంతో సామాన్యుడి బతుకు భారంగా మారింది. పెట్రోల్, డీజిల్ దగ్గర్నుంచి.. వంటింటి సామాన్ల వరకు అన్ని ధరలూ మండిపోతున్నాయి. ధరల పెరుగుదల వల్ల పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల గురించి ఓ చిన్నారి ఏకంగా దేశ ప్రధానికే లేఖ (Letter to PM Modi) రాసింది. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇది కూడా చదవండి..

Military Academy: ఆ తల్లికి పుత్రోత్సాహం.. ఈ ఫొటో వెనుక కథ ఏంటంటే..


`నా పేరు కృతి దుబే. నేను ఒకటో తరగతి చదువుతున్నాను. మోదీజీ.. మీరు ధరలు పెంచేస్తున్నారు. నేను ఉపయోగించే పెన్సిల్, ఎరేజర్ ధరలు కూడా పెరిగిపోయాయి. మ్యాగీ ధర కూడా బాగా పెరిగిపోయింది. (Pencil, Eraser, Maggi Gone Costlier) పెన్సిల్ కావాలని అడిగితే మా అమ్మ నన్ను కొడుతోంది. పెన్సిల్, ఎరేజర్‌ను క్లాస్‌లోని ఇతర పిల్లలు దొంగతనం చేస్తే నేనేం చేయగలను` అని ఆ బాలిక లేఖ రాసింది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ ఛిబ్రమౌ పట్టణంలో ఉంటున్న ఆ బాలిక రాసిన లేఖను తండ్రి విశాల్ దుబే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


`ఇది నా కూతురి `మన్ కీ బాత్`. స్కూల్‌లో పెన్సిలో పోగొట్టుకున్నందుకు అమ్మ కొట్టిందని ఇలా లేఖ రాసింద`ని విశాల్ పేర్కొన్నాడు. కాగా, ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ (Viral News) అవుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Updated Date - 2022-08-01T21:42:23+05:30 IST