యూపీ ఎన్నికలు: పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ

ABN , First Publish Date - 2022-02-20T22:09:47+05:30 IST

మూడో విడతలో భాగంగా యూపీలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ కొనసాగుతోంది. 59 నియోజకవర్గాల్లో 627 మంది అభ్యర్థులు పోటలో ఉన్నారు. మొత్తం 2.15 కోట్ల ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..

యూపీ ఎన్నికలు: పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మూడవ విడత పోలింగ్ కొనసాగుతోంది.  కాగా, పోలింగ్ జరుగుతోన్న కాన్పూర్‌లో పోలీసులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సబంధించిన కొన్ని ఫొటోలు, చిన్నపాటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.


మూడో విడతలో భాగంగా యూపీలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ కొనసాగుతోంది. 59 నియోజకవర్గాల్లో 627 మంది అభ్యర్థులు పోటలో ఉన్నారు. మొత్తం 2.15 కోట్ల ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, సాయంత్రం మూడు గంటల వరకు 48.81 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Updated Date - 2022-02-20T22:09:47+05:30 IST