భోపాల్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కరేడి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో ఒక దుకాణం, మూడు మోటారుసైకిళ్లను దహనం చేశారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.రెండు వర్గాల ప్రజలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.ఈ ఘర్షణకు కారణాలు తెలియలేదు. కాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం గురువారం నిరసన చేపట్టింది.ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ బీజేపీపై మండిపడింది.యూత్ కాంగ్రెస్ నేతలు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారిక నివాసం ముందు గుమిగూడి నిరసన తెలిపారు.యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమంలో మాజీ సీఎం కమలనాథ్ కూడా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి