విడిపోనున్న క్లార్క్‌ దంపతులు

ABN , First Publish Date - 2020-02-14T09:55:05+05:30 IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ తన ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నాడు. 2012లో కైలీ బోల్డీని...

విడిపోనున్న క్లార్క్‌ దంపతులు

సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ తన ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నాడు. 2012లో కైలీ బోల్డీని వివాహం చేసుకున్న క్లార్క్‌ గత ఐదు నెలల నుంచి భార్యకు దూరంగానే ఉంటున్నాడు. వీరికి నాలుగేళ్ల పాప ఉండగా ఆ చిన్నారి బాధ్యతను ఇద్దరూ తీసుకోనున్నారు. పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగానే తామిద్దరం విడిపోతున్నట్టు క్లార్క్‌ చెప్పుకొచ్చాడు. మరోవైపు భరణం కింద  కైలీకి 285 కోట్ల రూపాయల్ని చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. 

Updated Date - 2020-02-14T09:55:05+05:30 IST