సఫారీ టూర్‌కు బీసీసీఐ ఓకే!

ABN , First Publish Date - 2021-12-04T08:40:33+05:30 IST

భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై స్పష్టత వచ్చింది. ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ విజృంభిస్తుండడంతో టీమిండియా టూర్‌పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

సఫారీ టూర్‌కు బీసీసీఐ ఓకే!

కోల్‌కతా: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనపై స్పష్టత వచ్చింది. ఆ దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ విజృంభిస్తుండడంతో టీమిండియా టూర్‌పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనకు క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎన్‌ఏ) ఏర్పాటు చేసిన అత్యంత సురక్షిత బయోబబుల్‌పై బీసీసీఐ సంతృప్తి వ్యక్తం చేస్తూ..టూర్‌ను షెడ్యూల్‌ ప్రకారం కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలిసింది.  ‘మేం దక్షిణాఫ్రికా వెళుతున్నాం. ఇది ఖాయం’ అని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఈనెల 17నుంచి జొహాన్నె్‌సబర్గ్‌లో జరిగే తొలి టెస్టుతో టీమిండియా ఏడు వారాల పర్యటన మొదలుకానుంది.  అనంతరం మరో రెండు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20ల్లో భారత్‌ తలపడనుంది. కాగా..బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం శనివారం కోల్‌కతాలో జరగనుంది. సఫారీ టూర్‌కు ఈ సమావేశం ఆమోదముద్ర వేసే అవకాశముంది. 

Updated Date - 2021-12-04T08:40:33+05:30 IST