Jul 9 2021 @ 16:10PM

డైరెక్టర్‌తో ధనుశ్‌ గొడవ.. చివరికి ఏమైందంటే?

తమిళ హీరో అయినప్పటికీ తెలుగు, బాలీవుడ్‌, హాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ  చిత్రాలతో బిజీగా ఉన్న హీరో ధనుశ్‌ ఇప్పుడు కార్తీక్‌ నరేన్ దర్శకత్వంలో  తన 43వ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్‌గా ఈ సినిమా దర్శకుడు కార్తీక్‌ నరేన్‌,ధనుశ్‌ మధ్య క్రియేటివ్‌ డిఫరెన్‌సెస్‌ రావడంతో.. కార్తీక్‌ నరేన్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడని, ఆ స్థానంలో మరో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్‌ ఖండించింది. ప్రస్తుతం ధనుశ్‌ 43వ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటోందని బయట వినిపిస్తోన్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పేశారు. సత్యజ్యోతి ఫిలింస్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్‌ హీరోయిన్‌.  ఈ సినిమా పూర్తి కాగానే ధనుశ్‌ తదుపరి చిత్రాన్నిశేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.