క్లాప్‌ నిర్వహణలో వెనుకంజ

ABN , First Publish Date - 2022-05-20T05:46:13+05:30 IST

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) నిర్వహణలో కడప కార్పొరేషన్‌ వెనుకంజలో ఉందని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

క్లాప్‌ నిర్వహణలో వెనుకంజ
వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కడప కార్పొరేషన్‌ కమిషనర్‌ రమణారెడ్డి, మున్సిపల్‌ అధికారులు

రోడ్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేయాలి 

సీజనల్‌ వ్యాధులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి

సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్‌ 


కడప(ఎర్రముక్కపల్లి), మే 19 : స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) నిర్వహణలో కడప కార్పొరేషన్‌ వెనుకంజలో ఉందని కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. రోడ్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాలన్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కడప కార్పొరేషన్‌ కార్యా లయంలో కమిషనర్‌, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ స్పందన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజు బయోమెట్రిక్‌ వేయాలన్నారు. సచివాలయ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కరించాలన్నారు. రోడ్లపై చెత్త లేకుండా చూడాలన్నారు. అలాగే తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు డివైడర్లు మధ్యలో మొక్కలు, గ్రీనరీ ఉండేటట్లు చూడాలన్నారు. తాగునీటి ఎద్దడి రాకుండా జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జేడీ పూర్ణచంద్రరావు, ఏడీలు ఆశాజ్యోతి,  శివపార్వతి, కడప కమిషనర్‌ రమణారెడ్డి, ఆర్‌ఓ కన్నయ్య, శానిటేషన్‌ సూపర్‌వైజర్‌ భరత్‌కుమార్‌, మేనేజర్‌ హిదయతుల్లా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:46:13+05:30 IST