విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయి: సీజేఐ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2021-07-01T01:49:53+05:30 IST

విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ

విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయి: సీజేఐ ఎన్వీ రమణ

ఢిల్లీ: విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మాజీ జడ్జి పీడీ దేశాయ్‌ స్మారక ఉపన్యాసాన్ని సీజేఐ ఎన్వీ రమణ ఇచ్చారు. ఏ వ్యవస్థపైనా ఎవరూ ఒత్తిడి తేవద్దని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. దేశంలో 17 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ప్రజలు తెలివిలేని వారు కాదని, సరైన సమయంలో తమ విజ్ఞతను చాటుకుంటూనే ఉన్నారని సీజేఐ రమణ అన్నారు. 


మిగతా రాజ్యాంగ వ్యవస్థలు తమ విధులను సక్రమంగా నెరవేరుస్తున్నాయో, లేదో, ఆత్మ పరిశీలన చేసుకోవాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. విమర్శలే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తాయని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-01T01:49:53+05:30 IST