కృష్ణా: తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి చేర్చిందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ ‘‘నాపై తెలుగు ప్రజల ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలి. "అబ్బాయ్ రమణ" అంటూ మా ఊరు పొన్నవరంలో పెద్దలు పలకరించిన వైనం నన్ను పులకరింపజేసింది. తెలుగు ప్రజలు చూపిన అపారమైన ప్రేమాభిమానాలు నేను, నా కుటుంబసభ్యులు ఎప్పటికీ మర్చిపోలేం.’’ అని అన్నారు. తన పర్యటనకు సహకరించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఎన్వీ రమణ కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి