లావు వెంకటేశ్వరరావు సతీమణికి CJI పాదాభివందనం..

ABN , First Publish Date - 2021-12-26T20:27:57+05:30 IST

గుంటూరు జిల్లాకు విచ్చేసిన సీజేఐ ఎన్వీ రమణ కానూరులోని

లావు వెంకటేశ్వరరావు సతీమణికి CJI పాదాభివందనం..

విజయవాడ : గుంటూరు జిల్లాకు విచ్చేసిన సీజేఐ ఎన్వీ రమణ కానూరులోని సిద్ధార్థ బీటెక్‌ కాలేజీలో జస్టిస్‌ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాస సభలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా లావు వెంకటేశ్వరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీజేఐ.. ఆయన సతీమణి నాగేంద్రమ్మకి సీజేఐ పాదాభివందనం చేశారు. అనంతరం లావు వెంకటేశ్వరరావు స్వగ్రామంలో గ్రంథాలయం స్థాపించారు. నాణ్యమైన విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని నమ్మేవారని.. లావు వెంకటేశ్వరరావు ఆదర్శాలే జస్టిస్‌ నాగేశ్వరరావుకు స్ఫూర్తి అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం భారత న్యాయవ్యవస్థ-భవిష్యత్తు సవాళ్లు అంశంపై సీజేఐ ప్రసంగించారు. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని.. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందన్నారు. సరైన సమయంలో తగిన నిర్ణయాలతో సంక్షోభం అధిగమించగలిగామని.. కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిందన్నారు.

Updated Date - 2021-12-26T20:27:57+05:30 IST