నేడు రాష్ట్రానికి సీజేఐ ఎన్వీ రమణ

ABN , First Publish Date - 2022-06-02T09:14:54+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే రాష్ట్ర చరిత్రలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. న్యాయపరిపాలన పరంగా అత్యంత కీలకమైన 33

నేడు రాష్ట్రానికి సీజేఐ ఎన్వీ రమణ

-33 జ్యుడీషియల్‌ జిల్లాల ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే రాష్ట్ర చరిత్రలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. న్యాయపరిపాలన పరంగా అత్యంత కీలకమైన 33 జ్యుడీషియల్‌ జిల్లాలను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్‌ హైకోర్టు నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. సాంకేతికంగా పరిశీలిస్తే హైదరాబాద్‌ న్యాయ జిల్లాలో ఎటువంటి మార్పులు జరగనందున... 32 నూతన జిల్లా కోర్టులను సీజేఐ, సీఎం ప్రారంభించనున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 10 మంది ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి (జిల్లా ప్రధాన న్యాయమూర్తులు)లు ఉండగా.. ఇకపై 33 మంది ఆ బాధ్యతలు నిర్వహించనున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో ఉన్న అదనపు జిల్లా జడ్జిలుగా ఉన్న వారు.. జిల్లా ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. సీనియారిటీ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల్లో మొదటి 10 మందికి మాత్రమే 10 జిల్లాల పరిపాలన (పోర్ట్‌ఫోలియో) బాధ్యతలు అప్పగించేవారు. ప్రస్తుతం హైకోర్టులోని 27 మంది న్యాయమూర్తులకు 33 జిల్లాల పోర్ట్‌ఫోలియో బాధ్యతలు అప్పగించనున్నారు. కాగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ రెండోసారి హైకోర్టు ప్రాంగణంలోకి రానున్నారు. 2019 జనవరి 1న తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు సందర్భంగా తొలిసారి వచ్చిన కేసీఆర్‌.. న్యాయమూర్తుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ 33 జ్యుడీషియల్‌ జిల్లాల ఏర్పాటు సందర్భంగా ప్రస్తుతం హైకోర్టుకు వస్తున్నారు.

Updated Date - 2022-06-02T09:14:54+05:30 IST