రాజ్‌భవన్‌లో మొక్కను నాటిన సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ

ABN , First Publish Date - 2021-06-16T00:59:29+05:30 IST

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా రాజ్‌భవన్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ

రాజ్‌భవన్‌లో మొక్కను నాటిన సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ

హైదరాబాద్: గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా రాజ్‌భవన్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ మొక్కను నాటారు.  అనంతరం మొక్కకు నీటిని పోశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా అనేక చోట్ల మొక్కలను నాటుతున్నారు. దీనిలో భాగంగా సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ ఛాలెంజ్‌ ఎంతగానో తోడ్పడుతుందని గతంలో ప్రధాని మోడీ ప్రశంసించారు. 


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు వృక్షవేదం పుస్తకాన్ని ఎంపీ సంతోష్ కుమార్ బహూకరించారు. 

Updated Date - 2021-06-16T00:59:29+05:30 IST