సివిల్స్‌ ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా కోవై స్వాతిశ్రీ

ABN , First Publish Date - 2022-05-31T13:41:02+05:30 IST

యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ పరీక్షా ఫలితాల్లో కోయంబత్తూరుకు చెందిన యువతి స్వాతిశ్రీ రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం ఆ పరీక్షా ఫలితాలు వెల్లడి కాగా,

సివిల్స్‌ ఫలితాల్లో స్టేట్‌ టాపర్‌గా కోవై స్వాతిశ్రీ

చెన్నై: యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్‌ పరీక్షా ఫలితాల్లో కోయంబత్తూరుకు చెందిన యువతి స్వాతిశ్రీ రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సోమవారం ఆ పరీక్షా ఫలితాలు వెల్లడి కాగా, స్వాతిశ్రీ జాతీయ స్థాయిలో 42వ ర్యాంక్‌ సాధించగా, రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. వ్యవసాయ పట్టభద్రురాలైన స్వాతిశ్రీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు, ఆ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. వ్యయసాయం లేకుంటే దేశానికి ఆహారం దొరకదని, అందుకే దానిని అభివృద్ధి పరచాలన్నదే తన ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇదేవిధంగా తంజావూరుకు చెందిన ఎస్‌.శివరామన్‌ జాతీయ స్థాయిలో 363వ ర్యాంక్‌, పుదుకోటకు చెందిన బి.గోపీకృష్ణ 491వ ర్యాంకు సాధించారు. రాష్ట్రం మొత్తమ్మీద సివిల్స్‌కు సుమారు 15 మంది ఎంపికైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-05-31T13:41:02+05:30 IST