సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన సంకీర్త్‌

ABN , First Publish Date - 2020-08-05T09:46:56+05:30 IST

బెల్లం పల్లి పట్టణంలోని సింగరేణి కార్మికు డు సిరిశెట్టి సత్యనారాయణ- అనిత దంపతుల కుమారుడు సిరిశెట్టి సంకీర్త్‌ సివిల్స్‌ ఫలితాల్లో

సివిల్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన  సంకీర్త్‌

ఆలిండియా స్థాయిలో 330వ ర్యాంక్‌   


బెల్లంపల్లి టౌన్‌, ఆగస్టు 4 : బెల్లం పల్లి పట్టణంలోని సింగరేణి కార్మికుడు సిరిశెట్టి సత్యనారాయణ- అనిత దంపతుల కుమారుడు సిరిశెట్టి సంకీర్త్‌  సివిల్స్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో  330 ర్యాంకు సాధించాడు. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీస్‌సీ) మం గళవారం విడుదల చేసింది. సంకీర్త్‌ పట్టణంలోని మథర్స్‌ కాన్వెంట్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు.


2008 నుంచి 2010 వరకు ఇంటర్మీడియట్‌ హైదరా బాద్‌ శ్రీచైతన్యలో, 2013లో బీటెక్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యంతో యూపీఎస్‌సీ పరీక్షల్లో 330 ర్యాంకు సాధించారు. సంకీర్త్‌ తం డ్రి సత్యనారాయణ బెల్లంపల్లిలోని సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగంలో ఎలక్ర్టీషన్‌గా పని చేస్తుండగా తల్లి మథర్స్‌ కాన్వెం ట్‌ ఇంగ్లీష్‌ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధు లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంకీర్త్‌ ఆదిలాబాద్‌ జిల్లాలో మిషన్‌ భగీరథలో ఏఈగా పని చేస్తున్నాడు. 

Updated Date - 2020-08-05T09:46:56+05:30 IST