Civils 2020 టాపర్స్ మార్కుల్లో చిత్ర విచిత్రాలు.. ఫస్ట్ ర్యాంకర్ కంటే ఇంటర్వ్యూలో 36 మార్కులు ఎక్కువ వచ్చినా ఆమెకు మూడో ప్లేస్..!

ABN , First Publish Date - 2021-09-30T15:53:33+05:30 IST

దేశంలో నిర్వహించే అత్యంత కఠిన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ టెస్ట్ కూడా ఒకటి. దీన్ని క్రాక్ చేయడానికి ఏటా లక్షలాది మంది పోటీ పడుతారు. కానీ విజయం సాధించేవారు మాత్రం వందల్లో ఉంటా

Civils 2020 టాపర్స్ మార్కుల్లో చిత్ర విచిత్రాలు.. ఫస్ట్ ర్యాంకర్ కంటే ఇంటర్వ్యూలో 36 మార్కులు ఎక్కువ వచ్చినా ఆమెకు మూడో ప్లేస్..!

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో నిర్వహించే అత్యంత కఠిన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ టెస్ట్ కూడా ఒకటి. దీన్ని క్రాక్ చేయడానికి ఏటా లక్షలాది మంది పోటీ పడుతారు. కానీ విజయం సాధించేవారు మాత్రం వందల్లో ఉంటారు. దీన్ని బట్టే అర్థమవుతుంది.. అందులో విజయం సాధించడం అంత ఈజీ కాదని. సివిల్ సర్వీసెస్ టెస్ట్‌ను క్రాక్ చేయడానికి కఠోర శ్రమ అవసరం. కాగా.. సివిల్ సర్వీసెస్ పరీక్ష-2020 ఫలితాలు ఇటీవల వెల్లడైన విషయం తెలిసిందే. అయితే సివిల్స్-2020 టాపర్స్ మార్కులను పరిశీలిస్తే అందులో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. అంకితా జైన్ అనే అభ్యర్థికి ఇంటర్యూలో 212 మార్కులు వచ్చాయి. ఇంటర్యూ మార్కుల పరంగా ఫస్ట్ ర్యాంక్ ఈమెదే. ఫలితాల్లో తొలి ర్యాంక్ సాధించిన శుభమ్ కుమార్ కంటే ఈమెకు 36 మార్కులు ఎక్కువగా వచ్చాయి. కానీ.. ఫలితాల్లో ఆమె మూడో ర్యాంకుకే పరిమితమయ్యారు. 



దీనికి కారణం ఏంటంటే.. మెయిన్ పరీక్షలో ఆమెకు తక్కువ మార్కులు రావడమే. మొయిన్ పరీక్షలో అంకితా జైన్‌కు 839 మార్కులు రాగా.. తొలి ర్యాంకు పొందిన శుభమ్ కుమార్‌కు 878 మార్కులు వచ్చాయి. దీంతో సవిల్స్ పరీక్షలో మొత్తం 2025 మార్కులు ఉండగా.. శుభమ్ కుమార్‌కు 1054 మార్కులు (మెయిన్ పరీక్షలో 878, ఇంటర్యూలో 176) పొంది ఆయన మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంటర్యూలో అత్యధిక మార్కులు సాధించిన అంకితా జైన్ 1051 మార్కులు (మెయిన్ పరీక్షలో 839, ఇంటర్యూలో 212) పొంది మూడో స్థానంలో నిలిచారు. సివిల్స్‌కు ఎంపికైన వారు సాధించిన మార్కుల వివరాలను తాజాగా యూపీఎస్సీ వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఆసక్తికర విషయం బయటపడింది. ఇదిలా ఉంటే.. ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించిన జాగ్రతి అవాస్థి అనే అభ్యర్థికి 1052 మార్కులు (మెయిన్ పరీక్షలో 859, ఇంటర్యూలో 193) వచ్చాయి. 


Updated Date - 2021-09-30T15:53:33+05:30 IST