శింగరకొండలో మళ్లీ మొదలైన అంతర్యుద్ధం

ABN , First Publish Date - 2022-05-18T05:26:23+05:30 IST

శింగరకొండలో మళ్లీ అంతర్యుద్ధం ఆరంభమైంది.

శింగరకొండలో మళ్లీ మొదలైన అంతర్యుద్ధం
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం

ఎవరిదారి వారిదే అన్నట్టుగా పాలకవర్గం, అధికారులు

పంతం  నెగ్గించుకునేందుకు  చైర్మన్‌ పట్టు

జరుగుతున్న సంఘటనలపై  ప్రజాప్రతినిధుల సీరియస్‌

అద్దంకి, మే 17: శింగరకొండలో మళ్లీ అంతర్యుద్ధం ఆరంభమైంది. పాలకవర్గం, అధికారులు సయోధ్యతో సాగుతున్నారనుకుంటున్న తరుణంలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలు పరిశీలిస్తే ఇందుకు బ లం చేకూరుస్తున్నాయి. సుమారు 12 సంవత్సరాల క్రి తం  కొత్త పాలకమండలి 2021 మార్చి  24న కొలు వు తీరింది. అప్పట్లో ఈవోగా  ఉన్న శ్రీనివాసరెడ్డి, చై ర్మన్‌ కోట శ్రీనివాసరెడ్డి మధ్య వివాదం నెలకొంది. వా రి మధ్య అంతర్యుద్ధం మరింత ముదిరి తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదులు చేసుకున్నారు. 

ఈ నేపథ్యంలో దేవదాయశాఖ ఉన్నతాధికారులు విచారణచేసి అప్పటి ఈవోపై  చర్యలు తీసుకున్నారు. అనంతరం ఈవోగా రఘునాధరెడ్డిని నియమించారు. అప్పట్లోనే ఈవోగా వేరే అధికారి పేరును చైర్మన్‌ సూ చించినట్లు సమాచార ం. కొంతకాలం పాటు పాలక మండలి, ఈవో, సిబ్బంది సయోధ్యతో మెలిగారు.  అ దే సమయంలో దేవాలయం  అభివృద్ధికి  కూడా  పె ద్ద ఎత్తున నిధులు  కూడా మంజూరు కావటంతో ప నులు  వేగవంతం  అవుతాయని భావించారు. 

అయితే, ఈవోగా శ్రీనివాసరెడ్డి పనిచేసిన  సమ యంలో ఆయనకు అనుకూలంగా, చైర్మన్‌కు వ్యతిరేకం గా కొంతమంది సిబ్బంది, పూజారులు పనిచేశారని పాలకవర్గం చైర్మన్‌  ఫిర్యాదులు చేశారు. తనకు వ్యతి రేకంగా పావులు కదిపిన  సిబ్బంది, పూజారుల పై  వేటు వేయాల్సిందేనని  పంతం పట్టినట్లు తెలుస్తుం ది.  ఈక్రమంలోనే ఓ కాం ట్రాక్టర్‌ ఉద్యోగి  సస్పెండ్‌ కాగా, డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెం ట్‌ను బదిలీ చేయించారు. అదే సమయంలో ఓ పూ జారికి సంజాయిషీ నోటీసులు కూడా జారీ  అయ్యా యి. ఇలా వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

దేవస్థానం అభివృద్ధికి  మంజూరైన నిధులకు టెం డర్లు, కాంట్రాక్టర్‌ల వివరాలు  అడిగినా కనీస  సమా చారం ఇవ్వటం లేదని పాలకమండలి ఆరోపిస్తుంది. అదే సమయంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన వి షయాలను కూడా తమతో సంబంధం లేకుండా  వ్య వహరిస్తున్నారని  గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్ర తి చిన్న విషయంలో పాలకమండలి జోక్యం చేసుకుం టుందన్న  గుర్రులో పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరి దారి వా రిదేగా మారింది. ఈ విషయాలు దేవాలయ అభివృ ద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న ప్రజాప్రతినిధుల దృష్టికి  కూడా వెళ్లింది. దీంతో దేవాలయ  అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా తరచూ  అధికారులు, సిబ్బంది  పై ఫిర్యాదులు చేయటం ఏమిటని పాలకమండలిని ప్ర శ్నించినట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా పాలకమండలి, అధికారులు, సిబ్బంది, పూజారులు సమన్వయంతో వ్యవహరించి దేవాలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని భక్తులు  కోరుతున్నారు.

Updated Date - 2022-05-18T05:26:23+05:30 IST