నిత్యావసరాల అక్రమాలపై ఫిర్యాదుకు పౌరసరఫరాల శాఖ కంట్రోల్‌రూమ్‌

ABN , First Publish Date - 2020-04-03T19:40:04+05:30 IST

నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణ, వినియోగ దారుల ఫిర్యాదులకు సహాయం, ఫిర్యాదుల స్వీకరణకు తెలంగాణ పౌరసరఫరాలశాఖ ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేసింది.

నిత్యావసరాల అక్రమాలపై ఫిర్యాదుకు పౌరసరఫరాల శాఖ కంట్రోల్‌రూమ్‌

హైదరాబాద్‌: నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణ, వినియోగ దారుల ఫిర్యాదులకు సహాయం, ఫిర్యాదుల స్వీకరణకు తెలంగాణ పౌరసరఫరాలశాఖ ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేసింది. సోమాజీగూడలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్‌కు నేరుగా ప్రజలు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేయవచ్చు. తెలంగాణ లాక్‌డౌన్‌ నేపద్యంలో కొందరు వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలు పెంచే వినియోగదారులను దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేసింది. పౌరసరఫరాలశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షణలో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేశారు. 24గంటల పాటు ఇది పనిచేస్తుంది. వినియోగ దారులు తమ ప్రాంతాల్లో వ్యాపారులు ధరలను పెంచి అమ్మతే నేరుగా 040-23336116 ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే కంట్రోల్‌ రూమ్‌ ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే నిత్యావసర సరుకులు రవాణా చేస్తున్న వాహనాల వివరాలను కూడా నమోదుచేస్తుంది. ఎల్‌పీపీ, నిత్యావసర సరుకుల నిల్వలను కూడా ప్రతి రోజూ సమీక్షిస్తుంది. కంట్రోల్‌ రూమ్‌కి వచ్చే  ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చర్యలు తీసుకుంటుంది. 

Updated Date - 2020-04-03T19:40:04+05:30 IST