పెట్రోల్‌ బంకుల్లో టాయిలెట్స్‌ తప్పని సరి

ABN , First Publish Date - 2020-07-12T21:25:49+05:30 IST

పెట్రోల్‌ బంకులు కేవలం మన వాహనంలో పెట్రోల్‌, డీజిల్‌ కొట్టడాని మాత్రమే పనికొచ్చేవి అని సరిపెట్టుకుంటే చాలదని పౌరసరఫరాల అధికారులు అంటున్నారు.

పెట్రోల్‌ బంకుల్లో టాయిలెట్స్‌ తప్పని సరి

హైదరాబాద్‌: పెట్రోల్‌ బంకులు కేవలం మన వాహనంలో పెట్రోల్‌, డీజిల్‌ కొట్టడాని మాత్రమే పనికొచ్చేవి అని సరిపెట్టుకుంటే చాలదని పౌరసరఫరాల అధికారులు అంటున్నారు. ఈ మేరకు పౌరసరఫరాలసంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తాహసిల్దార్‌ మాచన రఘునందన్‌ ప్రతి  పలు పెట్రోల్‌ బంకుల్లో ప్రజా అవసరం దృష్ట్యా మరుగుదొడ్ల సౌకర్యం కూడా తప్పని సరిగా ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ఈనేపధ్యంలో ప్రతి పెట్రోల్‌ బంకును అధికారులు విధిగా తనిఖీ చేసి టాయిలెట్‌ ఉందా? లేదా? అని చెక్‌చేస్తున్నారు. ఒక వేళ లేకపోతే టాయిలెట్‌ సాధ్యమైనంత త్వరగా ఏర్పాటుచేయాలని డీలర్లను ఆదేశిస్తున్నారు. జన సామాన్యం నగరల్లో గానీ, పట్టణాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకులు మహా అయితే పెట్రోల్‌ను కల్తీలేకుండా, సరిగ్గా పోస్తేచాలు అనుకుంటారు. కానీ ఇతర ప్రజా అవరాల నిమిత్తం కూడా బంకులో కొన్ని సాధారణ సౌకర్యాలు ఉండాలని, వాటిని అవసరం మేరకు వాడుకునే అవకాశం ఉంటుందని ఎవరూ అంతగా ఆలోచించడం లేదు.


ప్రజా సౌకర్యార్ధం మరుగుదొడ్లను సైతం పెట్రోల్‌ బంకుల్లో తప్పని సరిగా ఉచితంగానే సౌకర్యం కల్పించాలని ఉన్న నిబంధనల విషయం చాలా మంది తెలియడం లేదని రఘునందన్‌ తెలిపారు. కొన్నిప్రాంతాల్లోపెట్రోల్‌ బంక్‌లను వాటి యాజమానులు ఏవేవో కొన్నికారణాల చేత లీజుకు, సబ్‌లీజుకు ఇచ్చి ఏదో నడుస్తుంది కదా అని మన పైసలు మనకు వస్తున్నాయి అంటూ కలెక్ట్‌ చేసుకుంటున్నారు. కానీ ఆయా టాయిలెట్స్‌ నిర్వహణ సరిగ్గా ఉందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. 


ఇలాంటి విషయం ఇటీవలే నారాయణపేట జిల్లాలోని ఓ బంక్‌లో చోటు చేసుకుంది. బంక్‌ యజమాని ఆయితే అసలు బంక్‌ నడుస్తుందా?? ఏదా? అన్నవిషయం పట్టించుకోవడం లేదు. అంతా మామూలే అన్నధోరణిలో బంధువులకు అప్పగించారు. నిజానికి ప్రతి పెట్రోల్‌ బంక్‌లో వాహన దారులు తమకు నేచర్‌ కాల్‌, లేదా టాయిలెట్‌ కు వెళ్లాలనుకుంటే అక్కడి టాయిలెట్స్‌ను వాడుకోవాలన్న విషయాన్ని తెలియకపోవడం గమనార్హం. ప్రతి బంకు యజమాని టాయిలెట్స్‌, మరుగుదొడ్ల గురించి స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. 


కానీ ఈ విషయంలో చాలా మంది యజమానులు ప్రచారం కల్పించడం లేదని మాచన రాఘునందన్‌ పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు తాను కొనుగోలుచేసే ప్రతి లీటర్‌ పెట్రోల్‌కు చెల్లించే డబ్బులో 6పైసలు టాయిలెట్‌ నిర్వహణ కోసం చెల్లిస్తున్నవిషయాన్ని తెలుసుకోవాలి. అన్నిపెట్రోల్‌ బంకులు ఈ మొత్తాన్నివసూలుచేస్తున్నాయి. ఈసందర్భంగా డిప్యూటీ తాహసిల్దార్‌ మాచన రఘునందన్‌ పెట్రోల్‌ బంకుకు వచ్చిన వారికి అవగాహన కల్పించారు. 

Updated Date - 2020-07-12T21:25:49+05:30 IST