సింగిల్ విండో డైరెక్టర్ ఇంట్లో రేషన్ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-09-24T01:38:26+05:30 IST

పంపిణీ బియ్యం ను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించిన వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పౌరసరఫరలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు.

సింగిల్ విండో డైరెక్టర్ ఇంట్లో రేషన్ బియ్యం స్వాధీనం

నారాయణపేట: పంపిణీ బియ్యం ను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించిన వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పౌరసరఫరలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. బుధవారం ఆయన నారాయణ పేట జిల్లా అప్పిరెడ్డి గ్రామం లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం నిల్వ కు బాధ్యులైన, ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం డైరెక్టర్ బొక్క అడివప్ప పై తగు చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.ఈ సందర్భంగా మాచన రఘునందన్ మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థ పేదల కు అన్నదాత అని అట్టి రేషన్ బియ్యం ను ఎవ్వరు అక్రమంగా అమ్మినా, కొన్నా ప్రజా పంపిణీ చట్టం ప్రకారం నేరం చేసినట్టే అని సూచించారు.


అప్పురెడ్డి పల్లి కి చేరుకున్న రఘునందన్ పోలీసుల సాయంతో ఎల్లమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నిల్వ చేసిన 40 బస్తాల బియ్యం ను పరిశీలించారు. అవి రేషన్ బియ్యమే అని ధృవీకరించారు. సుమారుగా 16 క్వింటాళ్ల మేరకు ఉన్నట్టు అంచనా వేసి , అప్పిరెడ్డి పల్లి చౌక దుకానానికి తగు రక్షణ నిల్వ నిమిత్తం గ్రామ సహాయకుల భాధ్యత తో అప్పగించారు.

Updated Date - 2020-09-24T01:38:26+05:30 IST