రేషన్ బియ్యం అక్రమ రవాణా పై నిఘా పెంచిన అధికారులు

ABN , First Publish Date - 2022-01-18T22:30:55+05:30 IST

రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు పౌరసరఫరా శాఖా అధికారులు నిఘా ను తీవ్ర తరం చేశారు.

రేషన్ బియ్యం అక్రమ రవాణా పై నిఘా పెంచిన అధికారులు

నల్లగొండ: రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు పౌరసరఫరా శాఖా అధికారులు నిఘా ను తీవ్ర తరం చేశారు. మంగళ వారం నాడు ఆ శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ఈ మేరకు పలు అనుమానాస్పద వాహనాలను పరిశీలించారు. కొండ మల్లె పల్లి, నిడమ నూరు,తదితర ప్రాంతాల్లో పర్యటించారు.ఆయా ప్రాంతాల్లో ఆగి ఉన్న, లోడ్ లారీలను వెళ్తున్న లారీలను ఆపి సరకు గురించి ఆరా తీశారు. లారీలు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నది వాటికి వే బిల్లులు ఉన్నాయా అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం పొద్దు పోయే వరకు ఈ తనిఖీ లు చేపట్టారు.


ముఖ్యంగా సూర్యాపేట, హుజూర్ నగర్ ప్రాంతాలకు రేషన్ బియ్యం గా అనుమానించదగ్గ సరకు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు.పెద్ద మొత్తం లో అక్రమ రవాణా జరుగుతోంది అని జనంలో ప్రచారం ,అనుమానాలూ వ్యక్తవుతున్న నేపథ్యం లో ఉన్నత స్థాయి ఆదేశాల ను పురస్కరించకునీ ముమ్మర తనిఖీలు చేపట్టారు."రేషన్" అక్రమ రవాణా కు ఎలాంటి ఆస్కారం ఇవ్వకూడదని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-18T22:30:55+05:30 IST