దేవరకొండలో రైస్ మిల్లులను తనిఖీ చేసిన పౌరసరఫరాల విజిలెన్స్ అధికారి

ABN , First Publish Date - 2022-01-17T23:05:14+05:30 IST

కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లెవీ ఇవ్వక పోవడం పై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈసందర్భంగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్ధార్ మాచన రఘునందన్ దేవర

దేవరకొండలో రైస్ మిల్లులను తనిఖీ చేసిన పౌరసరఫరాల విజిలెన్స్ అధికారి

దేవర కొండ: కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లెవీ ఇవ్వక పోవడం పై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈసందర్భంగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్ధార్ మాచన రఘునందన్ దేవర కొండలోని పలు రైస్ మిల్లులను సోమవారం తనిఖీ చేశారు. గంటకు ఎన్ని బస్తాల బియ్యం నిండుతయి ?నెలకు ఎంత కరెంటు ఖర్చు అవుతుంది? అంటూ వారి నుంచి వివరాలు తీసుకున్నారు. దేవర కొండ డివిజన్ పరిధిలోని మల్లె పల్లి తదితర ప్రాంతాల్లోని మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.


ఏయే మిల్లుల్లో ఎంత ధాన్యం నిలువ ఉంది.సీఎంఆర్ రికార్డులను సరిగా నిర్వహిస్తున్నారా? ఎంత ధాన్యం ఇప్పటి వరకు మిల్లింగ్ అయ్యింది...ఇలా పలు విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాధ్య మైనంత త్వరిత గతిన లెవీ ధాన్యం ను మర పట్టి ప్రభుత్వానికి అప్ప గించాలనీ రైస్ మిల్లర్ల కు సూచించారు. లెవీ బియ్యంను సకాలo లో అప్ప జెప్పడం లో ఏ మాత్రం ఉదాసీనత పనికి రాదన్నారు.


Updated Date - 2022-01-17T23:05:14+05:30 IST