తరలిన ధాన్యం..రైతుల సంతోషం

ABN , First Publish Date - 2021-06-23T22:30:16+05:30 IST

కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వానికి తమ వడ్లను అప్పగించేందుకు రైతులు పోటీ పడ్డారు. పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సమయ స్ఫూర్తి తో

తరలిన ధాన్యం..రైతుల సంతోషం

నారాయణపేట: కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వానికి తమ వడ్లను అప్పగించేందుకు రైతులు పోటీ పడ్డారు. పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సమయ స్ఫూర్తి తో వడ్ల సేకరణ ప్రక్రియ సులువుగా జరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మరికల్ లోని ఆత్మకూర్ రోడ్ లో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలు ఉంది. దాన్ని లెవీ ధాన్యం సురక్షితంగా భద్రపరచటం కోసం అధికారులు ఎంపిక చేశారు. కాగా ఇక్కడికి వచ్చిన రైతులు ఎవరంతట వారు తామంటే తామే ధాన్యం ట్రాక్టర్ల నుంచి ఖాళీ చేసి వెళ్తామని పోటీ పడ్డారు. దీంతో ఉన్న కొద్ది స్థలం లో ఎక్కువ ధాన్యం ఎలా పెడతాయని డీ టీ రఘునందన్ నచ్చ జెప్పారు.


ఇప్పటికే సదరు ఫంక్షన్ హాలు వారు వీలైనంత స్థలం కేటాయించి సాధ్యమైనంత మేరకు వడ్లను నిల్వ చేసుకొనే అవకాశం కల్పించారు. ఐనప్పటికి ధాన్వాడ వైపు నుంచి వచ్చిన రైతుల ధాన్యం అధికంగా ఉండటం తో , వారిని మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట వద్ద ఉన్న పెద్ద గిడ్డంగి కి వెళ్లాల్సిందిగా అధికారుల సూచన మేరకు రఘునందన్ విషయం వివరించి రెండు లారీల ను తెప్పించారు.దీంతో దాదాపు 8 ట్రాక్టర్ లు 2 డీ సీ ఎం వాహనాల్లో ఉన్న ధాన్యం భూత్పూర్ సమీపం లో ఉన్న మూసాపేట గిడ్డంగికి తరలింది. తమ ధాన్యం ను తరలించ డంలో ప్రత్యేక చొరవ చూపిన డీ టీ రఘునందన్ లౌక్యం పట్ల రైతుల పట్ల ఉన్న ఆపార ఆదర అభిమానాల పట్ల ఆన్న దాతలు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-06-23T22:30:16+05:30 IST