గత ఏడాది వానాకాలం రికార్డును దాటిన ధాన్యం కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-12-16T22:59:45+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది.

గత ఏడాది వానాకాలం రికార్డును దాటిన ధాన్యం కొనుగోళ్లు

హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం గత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్రంలో సైతం సాధ్యం కానిది కేవలం ఏడు సంవత్సరాల తెలంగాణలో సుసాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఈ వానాకాలంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి గత ఏడాది రికార్డును తిరగరాసింది.గత ఏడాది వానాకాలంలో పౌరసరఫరాల సంస్థ 48.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా తాజాగా ఈ వానాకాలంలో దాన్ని బ్రేక్ చేస్తూ గురువారం నాటికి దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించిందన్నారు. 


వానాకాలంలో ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధించింది.ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడు సంవత్సరాల్లో భారతదేశ అబ్బురపడే విధంగా వ్యవసాయరంగం అభివృద్ధి చెందిందని, వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అని నిరూపించారని అన్నారు.వ్యవసాయమే సాధ్యం కాదన్నచోట ఏడాదిలో కోటి టన్నులకు పైగా ధాన్యం పండించి చూపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అడుగడుగునా అండగా నిలిచారు.


ధాన్యం కొనుగోళ్లు అర్థికంగా భారం కావడంతో సీఎం కేసీఆర్ఎంత ఆర్థిక భారమైనా కూడా భరించి రైతుల నుంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.కోటి ఎకారాలను సాగులోకి తేవాలని కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు. ప్రపంచం యావత్తు అశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. గ్రామాల్లో చెరువులను నింపారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటలు కరెంటును ఉచితంగా అందిస్తున్నారు. వ్యవసాయం చేయడానికి పెట్టుబడి కోసం ఎదురుచూడకుండా ఎరువులు, విత్తనాల కోసం రైతుబంధు పథకం ద్వారా ప్రతి పంటకు రైతుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు వేస్తున్నారు. ఏ కారణం చేత రైతు మరణించిన అతడి కుటుంబానికి 5 లక్షల రైతు భీమా అందించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. 


రైతులంగా ఒక దగ్గర కూర్చొని వ్యవసాయంపై చర్చించుకునేందుకు రైతు వేదికలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.ఈ సీజన్ వరకు ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో రైతాంగం ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం ఛైర్మన్ మారెడ్డి భరోసా ఇచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, కొత్తగూడెం, కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. 14 జిల్లాల్లో 1,810 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగిందని వివరించారు.

Updated Date - 2021-12-16T22:59:45+05:30 IST