పౌరసరఫరాల వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దు

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

ఆస్తులను తనఖా పెట్టి సివిల్‌ సప్లై వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని, హమాలీల ఉపాధికి భద్రత కల్పిం చాలని ఏఐటీయూసీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ ఎల్‌.నాగసుబ్బారెడ్డి డి మాండ్‌ చేశారు.

పౌరసరఫరాల వ్యవస్థను  నిర్వీర్యం చేయవద్దు
ధర్నా చేస్తున్న హమాలీలు

కడప(సెవెనరోడ్స్‌), మే 16 : ఆస్తులను తనఖా పెట్టి సివిల్‌ సప్లై వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దని, హమాలీల ఉపాధికి భద్రత కల్పిం చాలని ఏఐటీయూసీ జిల్లా జనరల్‌ సెక్రెటరీ ఎల్‌.నాగసుబ్బారెడ్డి డి మాండ్‌ చేశారు. కూలి రేట్లు పెంచాలంటూ సోమవారం స్థానిక మార్కెట్‌ యార్డ్‌లోని సివిల్‌ సప్లై గోడౌన వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్‌ సప్లైస్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన సభ్యులు ధర్నా చేశారు. ఈ సదర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సివిల్‌ సప్లై, హమాలీ వర్కర్స్‌ యూనియన గౌరవాధ ్యక్షుడు ఎల్‌ నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల స్టాక్‌ పాయింట్లలో  లోడింగ్‌, అనలోడింగ్‌ నిలిపివేసి నిరసన వ్యక్తం చేశార న్నారు. ధరలు రోజు రోజుకు పెరుగుతున్నా హమాలీల కూలి మాత్రం రెండేళ్లుగా గడిచినా పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి నగదు బదిలీ పథకాన్ని తీసుకొచ్చి ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడవద్దన్నారు. సివిల్‌ సప్లై కార్పొరేషన అధికారులు యూనియన నాయకులతో చర్చించి న్యాయం చేయాలని కోరారు.  ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ కెసి.బాదుల్లా, నగర కార్యదర్శి ఉద్దే మద్దిలేటి, సివిల్‌ సప్లైస్‌ హమాలీ వర ్కర్స్‌ యూనియన కార్యదర్శి మురారి, కోశాధికారి రమణ, నాయకులు శ్రీకాంత, నాగయ్య, ప్రతాప్‌, రాజశేఖర్‌, రామ్మోహన తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST