IAS కావాలని ప్రయత్నిస్తున్న వాళ్లందరూ ఆ రైల్వే స్టేషన్‌కు ఎందుకెళ్తున్నారు..? ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

ABN , First Publish Date - 2021-10-07T22:05:04+05:30 IST

దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్విస్ టెస్ట్ కూడా ఒకటి. ఇందులో విజయం సాధించడం అంటే మాటలు కాదు. ఈ పరీక్షను క్రాక్ చేసి.. ఐఎఫ్ఎస్,

IAS కావాలని ప్రయత్నిస్తున్న వాళ్లందరూ ఆ రైల్వే స్టేషన్‌కు ఎందుకెళ్తున్నారు..? ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్విస్ టెస్ట్ కూడా ఒకటి. ఇందులో విజయం సాధించడం అంటే మాటలు కాదు. ఈ పరీక్షను క్రాక్ చేసి.. ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే అభ్యర్థులు గ్రంథాలయాలు, స్టడీ సెంటర్లలో పుస్తకాలో నిత్యం కుస్తీ పడుతూ ఉంటారు. కానీ ఓ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రతి రోజూ రైల్వే స్టేషన్‌ను సందర్శిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రైల్వేస్టేషన్‌కు వెళ్తూ.. రోజులో నాలుగు గంటలు అక్కడే గడుపుతున్నారు. ఇంతకూ అభ్యర్థులు ప్రత్యేకించి ఆ ఒక్క రైల్వే స్టేషన్‌ను మాత్రమే ఎందుకు సందర్శిస్తున్నారు. వారు అక్కడకు వెళ్లడం వెనక ఉన్న మతలబు ఎంటనే వివరాల్లోకి వెళితే.. 



బిహార్‌లో ఉన్న సాసారామ్ రైల్వే స్టేషన్‌లోని మొదటి రెండు ప్లాట్‌ఫాంలు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో సివిల్ సర్విసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో పాటు ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వారితో కిటకిటలాడుతుంది. భారీ ఎత్తున అభ్యర్థులు రైల్వే స్టేషన్‌కు వచ్చి.. పుస్తకాలతో కుస్తీ పడుతున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వాళ్లు.. వారి ఇళ్లను, గ్రంథాయాలను, స్టడీ సెంటర్లను వదిలి రైల్వే స్టేషన్‌కు ఎందుకొస్తున్నారనే అంశంపై తాజాగా ఆరా తీయగా ఆసక్తికరమైన అంశం బయటపడింది.



 సాసారామ్ రైల్వే స్టేషన్‌కు చుట్టు పక్కన గ్రామాల్లో నివసిస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులను కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయట. కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక అక్కడి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. పగలంతా కరెంటుతో పని లేకపోయినా.. చీకటి పడిన తర్వాత కరెంట్ తప్పనిసరి కావడంతో అభ్యర్థులు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారట. రైల్వే స్టేషన్‌లో 24 గంటలపాటు కరెంటు అందుబాటులో ఉండటంతో.. ప్రతి రోజు నాలుగు గంటలపాటు అక్కడకు చేరుకుని తమ చదువును కొనసాగిస్తున్నారట. 2002 నుంచి ఇక్కడి అభ్యర్థులు.. సాసారామ్ రైల్వేస్టేషన్‌పైనే ఆధారపడి పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారట. 

Updated Date - 2021-10-07T22:05:04+05:30 IST