2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ‘సివిల్‌’ పంచాయితీలకు అడ్డా!

ABN , First Publish Date - 2022-05-18T03:49:55+05:30 IST

2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ‘సివిల్‌’ పంచాయితీలకు అడ్డా!

2వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌  ‘సివిల్‌’ పంచాయితీలకు అడ్డా!
మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు డేగా సత్యం తదితరులు

సీపీఐ నేతలు ధ్వజం

కావలి, మే 17: సివిల్‌ కేసుల పంచాయతీలకు కావలి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ అడ్డాగా మారిందని, అంబేద్కర్‌ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ తప్పుడు అట్రాసిటీ కేసులు బనాయిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీఐ కావలి నియోజకవర్గ కార్యదర్శి డేగా సత్యం ఆరోపించారు. కావలి జర్నలిస్ట్‌ క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిట్టీల యజమానులకు పోలీసులు సహకరిస్తూ తప్పుడు కేసులు పెట్టడం దేనికి సంకేమని ప్రశ్నించారు. పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన బియా రాణి వద్ద అదే ప్రాంతానికి చెందిన రాణెమ్మ రూ.2 లక్షల చిట్టీ వేసిందన్నారు. 20 నెలలు కట్టాల్సిన ఆ చిట్టీ పాటలో 18 నెలలు సక్రమంగా కట్టిందని గత కరోనా సమయంలో రెండు నెలలు చిట్టీ కట్టకపోవడంతో దాని లెక్కలు చూసుకునేందుకు మహేష్‌ అనే వ్యక్తిని తీసుకెళ్లిందన్నారు. అక్కడ కట్టాల్సిన డబ్బుకు వడ్డీలు ఎక్కువగా వేసి అధిక మొత్తం కట్టాలనడం, అందుకు ఆమె అంగీకరించకపోవడంతో చిట్టీల నిర్వాహకురాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టిందన్నారు. ఇరు వర్గాలను పిలిచి మాట్లాడిన ఎస్‌ఐ నాగరాజు 20 రోజుల తర్వాత చిట్టీల నిర్వాహకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాణెమ్మతోపాటు ఆమె చెల్లెలు,ౖ మధ్యవర్తిగా వెళ్లిన కార్మిక నాయకుడు మహే్‌షపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమన్నారు. అసలు చిట్టీ యజమానికి పోలీసుల సహకరించడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. దీనిపై జిల్లా ఎస్పీ స్పందించి కేసు కట్టిన ఎస్‌ఐ నాగరాజు, ఆయనకు సహకరించిన కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకుడు చేవూరు కొండయ్య, చిట్టీ బాధితురాలు రాణెమ్మ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-18T03:49:55+05:30 IST