పౌర చట్టం ఎవరికీ కీడు చేయదు

ABN , First Publish Date - 2020-02-19T06:14:22+05:30 IST

నేనో 88 సంవత్సరాల వృద్ధుణ్ని. నా అదృష్టవశాత్తు 1963లో న్యాయ శాఖలో ఒక ఉద్యోగంలో చేరి, రెండు ప్రమోషన్లు పొంది 1990 డిసెంబర్‌లో పదవీ విమరణ చేశాను. పెన్షన్‌ డబ్బుతో ప్రశాంతంగా, సుఖంగా బతుకుతున్నాను...

పౌర చట్టం ఎవరికీ కీడు చేయదు

ప్రపంచంలో ముస్లింలకెన్ని దేశాలు న్నాయి? క్రైస్తవులకెన్ని దేశాలున్నాయి? హిందువులకెన్ని దేశాలున్నాయి? హిందువులు ఈ దేశంలో అనాదిగా ఉన్న జాతి. ముస్లిం, క్రైస్తవ మతాలు తరువాత పుట్టాయి గదా! ఉదాహరణకు నాలుగు వేదాలు ఈ దేశంలోనే పుట్టాయి గదా! ఆనాటికి ప్రపంచంలో ఇస్లాం, క్రైస్తవాలు ఉన్నాయా? మరి అంత పురాతన జాతికి, ప్రపంచంలోని ఇన్ని దేశాలలో ఒక్క భారత దేశం వారిది అంటే అది దౌర్జన్యమా? ద్రోహమా? అబద్ధమా?


నేనో 88 సంవత్సరాల వృద్ధుణ్ని. నా అదృష్టవశాత్తు 1963లో న్యాయ శాఖలో ఒక ఉద్యోగంలో చేరి, రెండు ప్రమోషన్లు పొంది 1990 డిసెంబర్‌లో పదవీ విమరణ చేశాను. పెన్షన్‌ డబ్బుతో ప్రశాంతంగా, సుఖంగా బతుకుతున్నాను. 


ఈ మధ్య కాలపు కొన్ని వింతలు చూసి ఈ వ్యాసం రాస్తున్నాను. 9వ తేదీ వార్తల ప్రకారం మన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆమోదించిన, ఏకగ్రీవ తీర్మానం చూసి ఈ వ్యాసం. దాని పేరు ‘సిటిజెన్‌షిప్‌ ఎమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (CAA) అని అధికారికంగా ‘గెజెట్‌ ఆఫ్‌ ఇండియా’లో 12 డిసెంబరున ప్రచురితమయింది. 

‘‘Provided that any person belonging to Hindu, Sikh, Buddhist, Jain, Parsee or Christian Community from Afghanistan, Bangladesh or Pakistan, who entered into India on or before 31st day of December 2014 and who has been exempted by the Central Government by or under clause (e), subsection(2)of section 3, the passport (Entry into India) Act 1920 of from the application, the provisions, the Foreigners Act 1946 or any rule order or order made in December, shall not be treated as illegal migrant for the purpose of this Act.’’


అంటే ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల నుంచి మన దేశంలోకి 31 డిసెంబర్‌ 2014 లోపుగా ప్రవేశించిన లేక మన కేంద్ర ప్రభుత్వం చేత – పాస్‌పోర్ట్‌ (Entry into India Act 1920 ) ద్వారా లేక Foreigners Act 1946 లేక వాటి కింద జారీ చేయబడిన ఏవైనా నిబంధనల వలన మినహాయించబడినా, వారిని చట్ట వ్యతిరేకంగా వచ్చినవారిగా (migrants)గా చూడకూడదు.


ఇది ఎవరికి అనువర్తిస్తుంది– హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు, జైనుల, పార్శీ లేక క్రైస్తవ మతానికి చెందినవారు బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ల నుంచి మన దేశంలోకి 31 డిసెంబర్‌ 2014 లోపుగా ప్రవేశించిన వారికి వర్తిస్తుంది– వారిని చట్ట వ్యతిరేకంగా వచ్చిన వారరిగా పరిగణింపబడరు. 


ఇదీ మన కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం. 

దానిని వ్యతిరేకించటమంటే, అక్కడ బాధలు పడలేక పైన చెప్పబడిన వారిక్కడికి రాగూడదనా మన ఉద్దేశం? ఎవరైనా ఒక దేశంలో పుట్టి పెరిగిన వారు, ఎందుకు ఆ దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళదామనుకుంటారు? ఆ నిర్భాగ్యులను మనం ఆదరించలేమా, ఆదరించగూడదా? దానికే మన దేశంలోని కొంత మంది వ్యక్తులు, కొన్ని రాజకీయ పక్షాలు– ఇంత రాద్ధాంతం చేస్తున్నాయి... అంటే ఈ నిర్భాగ్యులంతా ఆ దేశాలలోనే బాధలు పడుతూ, చితికి పోవాలా?


ఈ చట్టం ద్వారా భారతీయ ముస్లింలకు జరిగిన అపకారం, ఏమైనా ఉందా? మరెందుకీ ఆందోళన? ఇంకో దుష్ప్రచారం... ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తున్నారని. దానికి ఆస్కారమే లేదని, ప్రశాంతంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. దీని విషయమై సూటిగా నా అభిప్రాయాలు చెబుతున్నాను క్షమించండి. ప్రపంచంలో ముస్లింలకెన్ని దేశాలు న్నాయి? క్రైస్తవులకెన్ని దేశాలున్నాయి? హిందువులకెన్ని దేశాలున్నాయి? హిందువుల ఈ దేశంలో అనాదిగా ఉన్న జాతి. ముస్లిం, క్రైస్తవ మతాలు తరువాత పుట్టాయి గదా! ఉదాహరణకు నాలుగు వేదాలు ఈ దేశంలోనే పుట్టాయి గదా! ఆనాటికి ప్రపంచంలో ఇస్లాం, క్రైస్తవాలు ఉన్నాయా? మరి అంత పురాతన జాతికి, ప్రపంచంలోని ఇన్ని దేశాలలో ఒక్క భారత దేశం వారిది అంటే అది దౌర్జన్యమా? ద్రోహమా? అబద్ధమా– ఆలోచించండి. 


ఇంకో విషయం– హిందువులు ఈ దేశం మొత్తాన్ని ఎంత కాలం ఏలినా, ఏ పరాయి దేశం మీద దండయాత్రలు చేయలా, వారిని హిందువులుగా మార్చాలని ప్రయత్నమూ చేయలా! డిసెంబర్‌ 27 నాటి ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ దినపత్రిక ఒక పెద్ద ఫోటోను ప్రచురించింది. ఏమిటది? పాకిస్థానీ హిందూ స్ర్తీలు, న్యూఢిల్లీలోని మంజూకాతిల్లా ప్రాంతంలోని క్యాంపుల్లో పని చేయటం. వారంతా ఈ దేశానికి, పాకిస్థాన్‌లోని సింధు ప్రాంతం నుంచి 7,8 సంవత్సరాల క్రితం వచ్చారట! ఫిబ్రవరి 10 సోమవారం ‘ఎక్స్‌ప్రెస్‌’ ఇంకో వార్తనూ ప్రచురించింది. Minorities Commission woos Churches on CAA ఎందుకంటే, కొంతమంది చర్చి పూజారులు, క్రైస్తవులు, ఈసీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ప్రకటనలు చేస్తూ పోతున్నారట! ఏమనాలి?


చివరగా, నన్ను క్షమించండి... మీరు మొదట్లో నేనిచ్చిన ఇంగ్లీషు భాగాన్ని చదవండి. అందులో భారత దేశంలోని ఏ ముస్లింకు, క్రిస్టియన్‌కూ అపకారం చేసేది ఏమయినా ఉందా? అయినా ఇలా పేట్రేగిపోతున్నారంటే, వారిని భరించాలా? ఆలోచించండి, క్షమించండి.

కె. తారానాథ్‌

Updated Date - 2020-02-19T06:14:22+05:30 IST