ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్ విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2020-05-26T13:31:12+05:30 IST

ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్ విమానాలను దేశీయ మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పచ్చజెండా...

ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్  విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ :  ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్  విమానాలను దేశీయ మార్గాల్లో రాకపోకలు సాగించేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పచ్చజెండా ఊపింది. ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్  విమానాలు, హెలికాప్టర్లు, మైక్రోలైట్ విమానాల  రాకపోకలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నెల 25వతేదీ నుంచి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 లాక్ డౌన్ సందర్భంగా రెండు నెలలపాటు దేశీయ ప్రైవేట్ జెట్‌లు, చార్టర్డ్  విమానాల రాకపోకలను నిలిపివేసిన విమానయాన మంత్రిత్వశాఖ తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చార్టర్డ్ విమానాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు విమానం బయలుదేరే సమయానికి కనీసం 45 నిమిషాల ముందు విమానాశ్రయం లేదా హెలీప్యాడ్ వద్ద రిపోర్టు చేయాలని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మార్గదర్శకాల్లో కోరింది. వృద్ధులు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు విమాన ప్రయాణాలు దూరంగా ఉండాలని పౌరవిమానయాన శాక సూచించింది. అయితే ఎయిర్ అంబులెన్సులకు ఈ నియమం వర్తించదు. విమాన ఆపరేటర్లు, ప్రయాణికుల మధ్య పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం చార్టర్డ్ విమాన ప్రయాణ చార్జీలు ఉండాలని మంత్రిత్వశాఖ తెలిపింది. చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించే వారు కూడా ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, వారు ఫేస్ మాస్క్ విధిగా ధరించాలని కోరింది. 

Updated Date - 2020-05-26T13:31:12+05:30 IST