ప్రైవేటు సేవలో తరిస్తున్న నగరపంచాయతీ

ABN , First Publish Date - 2020-07-11T11:33:11+05:30 IST

నగరపంచాయతీ సిబ్బంది, యంత్రాలు ప్రైవేటు వ్యక్తుల సేవలో తరిస్తున్నారు. గత రెండు రోజులుగా బూర్జ మండల పరిధిలో వేసిన ప్రైవేటు వ్యక్తుల లే అవుట్‌ పనులకు

ప్రైవేటు సేవలో తరిస్తున్న నగరపంచాయతీ

పాలకొండ: నగరపంచాయతీ సిబ్బంది, యంత్రాలు ప్రైవేటు వ్యక్తుల సేవలో తరిస్తున్నారు. గత రెండు రోజులుగా బూర్జ మండల పరిధిలో వేసిన ప్రైవేటు వ్యక్తుల లే అవుట్‌ పనులకు నగరపంచాయతీకి చెందిన జేసీబీతోపాటు సిబ్బంది పనులు చేయడం విమర్శలకు తావిస్తుంది. పట్టణంలో అపారిశుధ్యం తాండవిస్తుంది.


కాలువల్లో పూడికలు తొలగించాల్సి ఉంది. కేవలం ఈ పనుల నిమిత్తమే వినియోగించాల్సిన మినీ జేసీబీని ప్రైవేటు వ్యక్తుల పనులకు వెళ్లడంపై అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే విషయమై కమిషనర్‌ బీఎం శివప్రసాద్‌ వద్ద ప్రస్తావించగా ఈవిషయం తన దృష్టికి రాలేదని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. 

Updated Date - 2020-07-11T11:33:11+05:30 IST