Abn logo
Sep 19 2020 @ 10:42AM

సిటీ బస్సులు సిద్ధం.. నిలబడి ప్రయాణించడం నిషిద్ధం

Kaakateeya

విజయవాడలో నేటి ఉదయం నుంచి దశలవారీగా బస్సులు 

నేడు 100.. రేపటి నుంచి 200 బస్సులు

మెట్రో ఎక్స్‌ప్రెస్‌లకే అనుమతి 

సీట్లలో కూర్చునే ప్రయాణం .. మాస్కు ధరిస్తేనే అనుమతి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) :  ఆరు నెలలుగా గ్యారేజీలకు పరిమితమైన సిటీ బస్సులు ఎట్టకేలకు శనివారం ఉదయం రోడ్డెక్కుతున్నాయి. శుక్రవారమే బస్సులు గ్యారేజీల నుంచి బయట కొచ్చాయి. అర్ధ సంవత్సరంపాటు కదలకుండా ఉండటంతో బస్సులను మెకానిక్‌ షెడ్లలోకి తీసుకు వచ్చి మరమ్మతులు నిర్వహించారు. అనంతరం శుభ్రం చేసి, శానిటైజేషన్‌ చేశారు. డిపోల్లోనే బస్సుల పనితీరును పరిశీలించారు. 


సిటీ బస్సులు నడిచే రూట్లు ఇవీ.. 

పీఎన్‌బీఎస్‌ - మైలవరం (రూట్‌ నెం.350), కేఆర్‌ మార్కెట్‌ - పామర్రు (రూట్‌ నెం.333), ఉయ్యూరు - సిటీ బస్‌ పోర్టు (222), పీఎన్‌బీఎస్‌ - హనుమాన్‌ జంక్షన్‌ (252), సిటీ బస్‌పోర్టు - గన్నవరం (116, 188, 252బి), పీఎన్‌బీఎస్‌ - తేలప్రోలు (201, 201టి), నగరంలో అంతర్గతంగా కబేళా - ఆటోనగర్‌ (5), మిల్క్‌ప్రాజెక్టు - గవర్నమెంట్‌ ప్రెస్‌(3), రాయనపాడు - మధురానగర్‌ (14)లతో పాటు కొండపల్లి - పీఎన్‌బీఎస్‌, శ్రీకాకుళం (ఉయ్యూరు) - మార్కెట్‌, కేఆర్‌ మార్కెట్‌ - తోట్లవల్లూరు, కేఆర్‌ మార్కెట్‌ - గుడివాడ బస్సులు నడుస్తాయి.  


నిలబడి ప్రయాణించడం నిషిద్ధం

సిటీబస్సుల్లో నిలబడి ప్రయాణించటానికి అవకాశం లేదు. సీట్లలో కూర్చొనే ప్రయాణించాలి. ప్రయాణికులు విధిగా మాస్కు ధరించాలి. బస్సు ఎక్కే ముందు థర్మల్‌ స్కానింగ్‌ నిర్వహిస్తారు. ఉష్ణ తీవ్రత ఎక్కువగా ఉంటే బస్సు ఎక్కనివ్వరు.

Advertisement
Advertisement
Advertisement