నేటి నుంచే సిటీ బస్సులు

ABN , First Publish Date - 2022-05-11T06:35:22+05:30 IST

దశాబ్ద కాలంగా నగర వాసులు ఎదురు చూస్తున్న సిటీ బస్సుల కల నేటితో నెరవేరనుంది. బుధవారం నుంచి నగర వీధుల్లో సిటీ బస్సులు పరిగెత్తనున్నాయి. ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సిటీ బస్సులను ప్రారంభించనున్నారు.

నేటి నుంచే సిటీ బస్సులు

సుభాష్‌నగర్‌, మే 10: దశాబ్ద కాలంగా నగర వాసులు ఎదురు చూస్తున్న సిటీ బస్సుల కల నేటితో నెరవేరనుంది. బుధవారం నుంచి నగర వీధుల్లో సిటీ బస్సులు పరిగెత్తనున్నాయి. ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సిటీ బస్సులను ప్రారంభించనున్నారు. నగరంలోని పలు వీధుల గుండా సిటీ బస్సులు నడువనున్నాయి. ఉదయం 9.30గంటలకు నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి బస్సులను ప్రారంభించనున్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఆర్టీసీ సిటీ బస్సు చార్జీలు ఉంటాయని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజినల్‌ మేనేజర్‌ ఉషాదేవి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్‌ నీతూకిరణ్‌ హాజరుకానున్నారని తెలిపారు.

సిటీ బస్సుల రూట్‌లు ఇవే..

నగరంలోని డెయిరీ ఫాం నుంచి నిజాంప్యాలెస్‌, అర్సపల్లి, మాలపల్లి, చార్‌భాయి పెట్రోల్‌బంకు, నిజామాబాద్‌ ఓల్డ్‌ బస్టాండ్‌ (బోధన్‌ బస్‌స్టాండ్‌) గాంధీచౌక్‌, దేవి రోడు, రైల్వేస్టేషన్‌, కలెక్టర్‌ చౌరస్తా, తిరుమల థియేటర్‌, దేవి థియేటర్‌ ఎక్స్‌రోడ్డు, ఫులాంగ్‌, తిరుమూర్తి, రాజీవ్‌గాంధీ బొమ్మ, ఆర్యనగర్‌ బోర్గాం మీదుగా మాధవనగర్‌, 300 క్వార్టర్స్‌ నుంచి నాగారాం ఐవోసీ, ఇందిరాపూర్‌, రేణుకానగర్‌, వర్ని ఎక్స్‌రోడ్డు, ఆర్‌ఆర్‌ చౌరస్తా, నెహ్రూపార్క్‌, గాంధీచౌక్‌, దేవీ రోడ్డు, బస్‌స్టాండ్‌, రైల్వే బ్రిడ్జి, దుబ్బా రోడ్డు, నిర్మలహృదయ పాఠశాల, ఎస్‌ఎఫ్‌ స్కూల్‌, రైతుబజార్‌, నూతన కలెక్టరేట్‌లలో నడపనున్నామని ఆర్‌ఎం. తెలిపారు.

Read more