Abn logo
Sep 24 2021 @ 22:45PM

స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

కావలిలో ప్రదర్శన నిర్వహిస్తున్న స్కీమ్‌ వర్కర్లు

కావలిటౌన్‌, సెప్టెంబరు 24: అంగన్‌వాడీలు, ఆశాలు, స్కూల్‌ స్వీపర్లు, మధ్యాహ్న భోజన పఽథక కార్మికులు (స్కీమ్‌ వర్కర్లు)ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌కే రహెనా బేగం డిమాండ్‌ చేశారు.  దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం స్కీమ్‌ వర్కర్లు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్డీవో శీనానాయక్‌కు వినతిపత్రం అందించారు. నెల 27న జరగనున్న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గౌరవాధ్యక్షుడు పీ.పెంచలయ్య, కృష్ణమోహన్‌, నరసింహ, యూనియన్‌ నాయకులు రఘరావమ్మ, విజయలత, కళావతి, సుభాషిణి, బిందు, గాయత్రి, అన్నమ్మ పాల్గొన్నారు.