కేంద్రం కార్మిక చట్టాలను కాలరాస్తోంది

ABN , First Publish Date - 2020-08-10T10:48:17+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందం టూ సీఐటీయూ నాయకులు ఆరోపించారు.

కేంద్రం కార్మిక చట్టాలను కాలరాస్తోంది

 నగరంలో సీఐటీయూ ఆందోళన


నెల్లూరు (వైద్యం), ఆగస్టు 9 : కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తోందం టూ సీఐటీయూ నాయకులు ఆరోపించారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ ఫ్యాక్టరీ కమిషన్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. నాయకుడు కిన్నెర కుమార్‌ మాట్లాడుతూ కేంద్రం కార్మికులను బానిసలుగా మార్చేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలకు లక్షల కోట్లు రాయితీ ఇచ్చి ప్రజలను ఆకలితో మాడుస్తోందన్నారు. ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డ కార్మికులకు నెలకు రూ. 10వేలు, 10 కిలోల రేషన్‌ బియ్యం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నేతలు శ్రీనివాసులు, గురవయ్య, జనార్దన్‌, చెంచయ్య, రామారావు, శ్రీనివాసులు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T10:48:17+05:30 IST