ఎంపీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2020-12-06T05:09:36+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కాపాడలేని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.

ఎంపీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
ఖాళీ భోజనం బాక్సులతో నిరసన తెలుపుతున్న కార్మికులు

  1. సీఐటీయూ డిమాండ్‌
  2.  ఖాళీ భోజనం బాక్సులతో ఆర్‌ఏఆర్‌ఎస్‌ కార్మికుల నిరసన


నంద్యాల, డిసెంబరు 5: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం భూమిని కాపాడలేని నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఎదుట కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఖాళీ భోజనం బాక్సులతో కార్మికులు నిరసన తెలిపారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ పరిశోధన కేంద్రం భూమిని వైద్య కళాశాలకు కేటాయించడం కోసం బీడు భూమి అని   హైకోర్టుకు తెలియజేయడం ఎంపీ పోచా, ఎమ్మెల్యే శిల్పా రవి కుట్రలో భాగమని  ఆరోపిం చారు. 26 రోజులుగా కార్మికులు, ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన చేస్తున్నా ఎంపీ, ఎమ్మెలే తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌పై ఆధారపడి దాదాపు 300 కుటుంబాలు పరిశోధనా కేంద్రం భూముల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాయన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూమిని వైద్య కళాశాలకు, ఇతర అవసరాలకు కేటాయిస్తే తమ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులు, కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ను కాపాడుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు, రైతులు కదిలి వస్తున్నారని, వైసీపీకి, ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు స్వస్తి చెప్పే రోజులు తొందరలోనే ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T05:09:36+05:30 IST