చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న విద్యార్థులు
అనంతసాగరం, జూన్ 25: స్ధానిక శాఖ గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు గ్రంథపాలకుడు డీ నారాయణరావు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రంతుల్లా, పాఠకులు పాల్గొన్నారు.