ఉద్యోగం చేస్తేనే పౌరసత్వం!

ABN , First Publish Date - 2021-12-03T07:03:39+05:30 IST

ఆ దేశ పౌరసత్వం కావాలంటే అక్కడ ఉద్యోగం సంపాదించాల్సిందే. ఒకవేళ ఉద్యోగం వదిలేస్తే పౌరసత్వం పోతుంది. ప్రపంచంలోనే అతి చిన్నదేశమయిన వాటికన్‌ సిటీ ప్రత్యేకత ఇది.

ఉద్యోగం చేస్తేనే పౌరసత్వం!

దేశ పౌరసత్వం కావాలంటే అక్కడ ఉద్యోగం సంపాదించాల్సిందే. ఒకవేళ ఉద్యోగం వదిలేస్తే పౌరసత్వం పోతుంది. ప్రపంచంలోనే అతి చిన్నదేశమయిన వాటికన్‌ సిటీ ప్రత్యేకత ఇది.

సాధారణంగా దేశమంటే ఇతర దేశాలతోనో లేక సముద్రం సరిహద్దులుగా కలిగి ఉంటుంది. వాటికన్‌ సిటీ మాత్రం ఒకనగరంలో దేశంగా ఉంటుంది. ఈ దేశ విస్తీర్ణం 121 ఎకరాలు మాత్రమే. ఇక జనాభా వెయ్యిలోపే ఉంటుంది.

వాటికన్‌ ప్యాలెస్‌, మ్యూజియం, మీటింగ్‌ రూమ్స్‌, రెసిడెన్షియల్‌ అపార్టుమెంట్లు, కార్యాలయాలు, పోప్‌ నివాస భవనం... ఇలా అన్నీ అనుసంధానం అయి ఉంటాయి. 

అధికారభాష లేని దేశం కూడా ఇదే. ఇక దేశ రక్షణ బాధ్యతలు స్విస్‌ గార్డ్స్‌ చూస్తుంటారు. పుట్టుకతో ఎవ్వరూ ఈ దేశ పౌరసత్వం పొందలేరు. ఎందుకంటే ఇక్కడ ప్రసూతి సంబంధ ఆసుపత్రులు లేవు. ఉద్యోగం సంపాదించుకుంటే పౌరసత్వం లభిస్తుంది.

సాధారణంగా ఒక కట్టడాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తుంది. కానీ వాటికన్‌ సిటీ మొత్తాన్ని యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది. అంటే ఒక దేశం మొత్తం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చారు.

Updated Date - 2021-12-03T07:03:39+05:30 IST