61వ డివిజన్‌లో సిటిజన్‌ అవుట్‌ రీచ్‌

ABN , First Publish Date - 2022-05-28T06:11:43+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు ముంగిట చేర్చటమే లక్ష్యంగా పని చేయాలని సచివాలయ సిబ్బందికి నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సూచించారు.

61వ డివిజన్‌లో సిటిజన్‌ అవుట్‌ రీచ్‌

61వ డివిజన్‌లో సిటిజన్‌ అవుట్‌ రీచ్‌

పాయకాపురం, మే 27 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు ముంగిట చేర్చటమే లక్ష్యంగా పని  చేయాలని సచివాలయ సిబ్బందికి నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సూచించారు. సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమంలో భాగంగా  శుక్రవారం  61వ డివిజన్‌లోని 262 సచివాలయ పరిధిలో సిబ్బంది నిర్వహించిన కార్యక్రమ వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

అభివృద్ధి పనుల పరిశీలన

లబ్బీపేట: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పనులు పూర్తి చేయాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ అధికారులను ఆదేశించారు. శక్రవారం ఆయన సర్కిల్‌ 3 పరిధిలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్‌ అభివృద్ధి పనులను పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పటమట నిర్మల హై స్కూల్‌ రోడ్డు, రామలింగేశ్వరనగర్‌ కట్ట, అమ్మ కళ్యాణ మండపం రోడ్డు, పీవీపీ, చెన్నుపాటి పెట్రోలు బంకు రోడ్డు తదితర ప్రాంతాల్లో నూతనంగా వేసిన రోడ్ల స్థితిగతులను, ఎత్తు, పనుల నాణ్యత, రీబౌండ్‌ హ్యామర్‌తో స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో ఈఈ చంద్రశేఖర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-28T06:11:43+05:30 IST