Oct 20 2021 @ 03:47AM

చీరకట్టులో చక్కనమ్మ

సినిమాల్లోనూ, బయటా ఆధునిక వస్త్రధారణతో ఫ్యాషన్‌కు ప్రతీకలా కనిపిస్తారు బాలీవుడ్‌ కథానాయిక కట్రీనాకైఫ్‌. అయితే చీరకట్టులో సడన్‌ ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అక్షయ్‌కుమార్‌ సరసన  తను హీరోయిన్‌గా నటించిన ‘సూర్యవంశీ’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో కట్రీనా పాల్గొంటున్నారు. అందులో భాగంగా చీరకట్టులో కెమెరాకు ఫోజులిచ్చారు. మోడ్రన్‌ దుస్తుల్లోనే కాదు చీరకట్టులోనూ నువ్వు చక్కనమ్మవే అంటూ అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం కట్రీనా ‘ఫోన్‌ బూత్‌’, ‘టైగర్‌ 3’, ‘జీలే జరా’ చిత్రాల్లో నటిస్తున్నారు. 


Bollywoodమరిన్ని...