రూ.4,000కే సిప్లా జనరిక్‌ రెమ్‌డెసివిర్‌

ABN , First Publish Date - 2020-07-09T06:07:59+05:30 IST

కోవిడ్‌ రోగుల కోసం సిప్లా కంపెనీ జనరిక్‌ రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేసింది. ‘సిప్రెమి’ పేరుతో విడుదల చేసిన ఈ ఔషధం ధర రూ.4,000. తొలి నెలలోనే 80 వేల వయల్స్‌ సరఫరా చేస్తామన్నారు...

రూ.4,000కే సిప్లా జనరిక్‌ రెమ్‌డెసివిర్‌

న్యూఢిల్లీ: కోవిడ్‌ రోగుల కోసం సిప్లా కంపెనీ జనరిక్‌  రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని మార్కెట్‌లో విడుదల చేసింది. ‘సిప్రెమి’ పేరుతో విడుదల చేసిన ఈ ఔషధం ధర రూ.4,000.  తొలి నెలలోనే 80 వేల వయల్స్‌ సరఫరా చేస్తామన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా తమ జనరిక్‌ రెమ్‌డెసివిర్‌ 100 ఎంజీ వయల్‌ ధర రూ.4,000  అని కంపెనీ సీఈఓ నిఖిల్‌ చోప్రా ప్రకటిం చారు. ప్రపంచం మొత్తం మీద ఇదే అతి తక్కువ ధర అని ఆయన తెలిపారు. ప్రస్తుతం జనరిక్‌ వెర్షన్‌ ఇదే ఔషధాన్ని హైదరాబాద్‌కు చెందిన హెటిరో రూ.5,400 చొప్పున, మైలాన్‌ కంపెనీ రూ.4,800 చొప్పున విక్రయిస్తున్నాయి.


Updated Date - 2020-07-09T06:07:59+05:30 IST