ఆర్థరైటిస్‌ను దూరం చేసే దాల్చిన చెక్క
ABN , First Publish Date - 2021-04-08T05:19:53+05:30 IST
దాల్చిన చెక్కను ఆహారంలో వాడుతూ ఉంటాం. అయితే దాల్చిన చెక్కను తేనెతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది
దాల్చిన చెక్కను ఆహారంలో వాడుతూ ఉంటాం. అయితే దాల్చిన చెక్కను తేనెతో కలిపి తీసుకుంటే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.
- దాల్చిన చెక్కను పొడి చేసుకోవాలి. తరువాత అందులో కొద్దిగా తేనె కలిపి పేస్టులా చేయాలి. బ్రేక్‌ఫా్‌స్టలో జెల్లీ, జామ్ బదులుగా దీన్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది.
- రెండు టేబుల్స్పూన్ల తేనె, ఒక చిన్న టీ స్పూన్ దాల్చిన చెక్కపొడిని కప్పు వేడి నీళ్లతో కలిపి తీసుకుంటే ఆర్థరైటిస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి.
- రెండు టేబుల్స్పూన్ల తేనె, మూడు టీస్పూన్ల దాల్చిన చెక్కపొడిని టీ వాటర్‌తో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే రెండు గంటల్లోగా 10 శాతం కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి ఇది అద్భుతమైన చిట్కా.
- జలుబుతో బాధపడుతున్నా ఒక టేబుల్‌స్పూన్ తేనె, పావు చెంచా దాల్చినచెక్క పొడిని రోజుకొకసారి మూడు రోజుల పాటు తీసుకోవాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, సైనస్ సమస్యలు దూరమవుతాయి.
- దాల్చిన చెక్కను తేనె కలిపి తీసుకుంటే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అల్సర్ సమస్య కూడా నయమవుతుంది.
- రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు పరగడుపున కప్పు నీటిలో తేనె, దాల్చిన చెక్కపొడి వేసుకుని మరిగించుకుని తాగాలి. రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు.
- ఒక టీ స్పూన్ తేనె, దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చటి నీళ్లలో వేసుకుని పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.
- రోజూ క్రమంతప్పకుండా దాల్చిన చెక్కపొడిని తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ లభిస్తుంది.