థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి

ABN , First Publish Date - 2022-01-05T16:29:52+05:30 IST

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌ను నిరోధించటంలో భాగంగా కొత్త ఆంక్షలు విధించారు. ఈ మేరకు రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌నివా్‌సలో

థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు అనుమతి

పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరోనా వైరస్‌ థర్డ్‌ వేవ్‌ను నిరోధించటంలో భాగంగా కొత్త ఆంక్షలు విధించారు. ఈ మేరకు రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌నివా్‌సలో మంగళవారం ఉదయం కరోనా నిరోధక ఉన్నతస్థాయి అధికారుల సమీక్షా సమావేశం తమిళిసై అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కరోనా, రూపాంతరం చెందిన ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కరోనా నిరోధక నిబంధ నలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు పుదుచ్చేరిలోని అన్ని సినిమా థియేటర్లలో మంగళవారం నుంచి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ఆమె ఆదేశించారు. ఇదే విధంగా వాణిజ్య సంస్థలు, నగలు, వస్త్రాల దుకాణాల్లో కూడా 50 శాతం కస్టమర్లను మాత్రమే అనుమతించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి అని అన్నారు. 15 నుంచి 18 యేళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అల్లోపతి వైద్యానికి ధీటుగా సిద్ధ, ఆయుర్వేద వైద్యం ద్వారా కరోనా బాధితులకు మెరుగైన చికిత్స కూడా అందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు ఉత్తర్వులిచ్చారు. కరోనా, ఒమైక్రాన్‌ బాధితులకు చికిత్సలందించడానికి సరిపడా ప్రత్యేక వార్డులను, ఆక్సిజన్‌తో కూడిన పడకలను తక్షణమే సిద్ధం చేయాలని తమిళిసై పేర్కొన్నారు.

Updated Date - 2022-01-05T16:29:52+05:30 IST