ఆగస్టు-8న సినీ యూనియన్ల ఎన్నికలు

ABN , First Publish Date - 2021-07-30T13:24:46+05:30 IST

తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ పరిధిలో ఉన్న..

ఆగస్టు-8న సినీ యూనియన్ల ఎన్నికలు

హైదరాబాద్ సిటీ/యూసు‌ఫ్‌గూడ : తెలుగు సినీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ పరిధిలో ఉన్న మూడు యూనియన్లకు ఆగస్టు 8న ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్‌ తెలిపారు. గురువారం వెంకగటగిరిలో ఉన్న ఫెడరేషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్యాన్సర్స్‌ యూనియన్‌, డ్రైవర్స్‌ యూనియన్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌కు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఆగస్టు 2న నామినేషన్‌ ప్రక్రియ ఉంటుందని, 8న ఎన్నికలు జరుగుతాయిని వివరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి పీఎ్‌సఎన్‌ దొర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T13:24:46+05:30 IST