Abn logo
Sep 25 2021 @ 09:10AM

సీనియర్‌ నిర్మాత కేఆర్‌కు సతీవియోగం

అడయార్‌(చెన్నై): ప్రముఖ సినీ నిర్మాత, సినీ పంపిణీదారుడు కేఆర్‌ సతీమణి ఇందిర(67) మృతిచెందారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత కొన్ని రోజులుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వీరికి కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు.