అమరావతి: బీజేపీలోకి సినీ గ్లామర్ పెరుగుతోంది. సినీ నటులు వాణీ విశ్వనాథ్ ప్రియారామన్, అర్చన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును బుధవారం నటి అర్చన కలిశారు. త్వరలో ఆమె బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.
కాగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే పలువుర్ని ఆకర్నించే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నికైనప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీ మరింతగా బలపడుతోంది. తాజాగా తిరుపతి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం, నేతలు ఆ స్థానంపై దృష్టి సారించారు. జనసేనతో పొత్తు పెట్టుకుని ఈ ఉపఎన్నికలో గెలవాలని భావిస్తున్నారు. ఇందుకు కావాలని ఏర్పాట్లను చురుగ్గా చేసుకుంటున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు సమక్షంలో పలువురు బీజేపీలో చేరిపోయారు. సినీ నటులు కూడా బీజేపీలో చేరుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.